Header Banner

ఏపీలో భవన నిర్మాణదారులకు కూటమి ప్రభుత్వం బంపర్ ఆఫర్! మున్సిపల్ శాఖ సంచలన నిర్ణయం!

  Mon Mar 03, 2025 18:22        Politics

ఏపీలో భవన నిర్మాణదారులకు కూటమి సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. ముఖ్యంగా భవన నిర్మాణ అనుమతుల కోసం గతంలో టౌన్ ప్లానింగ్ అధికారుల చుట్టూ తిరిగి లంచాలు సమర్పించుకునే పరిస్ధితికి చెక్ పెట్టేందుకు వేగంగా చర్యలు తీసుకుంటున్న మున్సిపల్ శాఖ ఈ మేరకు కీలక అడుగు వేసింది. భవన నిర్మాణదారుల కోసం కొత్త సాఫ్ట్ వేర్ ను అందుబాటులోకి తెచ్చింది. అంతే కాదు ఇందులో భవన నిర్మాణదారులకు ఆటోమేటిక్ అనుమతుల కోసం అవకాశం కల్పిస్తోంది. రాష్ట్రంలో ఇకపై 18 మీటర్ల ఎత్తు లోపు నిర్మించే భవనాలకు స్వీయ ధ్రువీకరణ పత్రం సరిపోతుందని మున్సిపల్ మంత్రి పొంగూరు నారాయణ ఇవాళ ప్రకటించారు.


ఇది కూడా చదవండినామినేటెడ్ పోస్టులపై సీఎం చంద్రబాబు క్లారిటీ!  పదవుల భర్తీకి డెడ్‌లైన్ ఫిక్స్!


ఈ మేరకు కొత్తగా అందుబాటులోకి తెచ్చిన సాఫ్ట్ వేర్ లో ఆప్షన్ ఇచ్చినట్లు ప్రకటన విడుదల చేశారు. టౌన్ ప్లానింగ్ అధికారుల‌తో సంబంధం లేకుండా స‌రైన ప‌త్రాలు స‌మ‌ర్పిస్తే ఆటోమెటిక్ గా అనుమ‌తులు పొందవచ్చని మున్సిపల్ మంత్రి తెలిపారు. వాస్తవానికి గత నెలలోనే దీనికి సంబంధించిన జీవో జారీ చేసినా, సాంకేతిక కారణాలతో కొత్త విధానం అందుబాటులోకి రాలేదు. ఇప్పుడు కొత్త సాఫ్ట్ వేర్ అందుబాటులోకి రావడంతో.. రిజిస్ట‌ర్డ్ ఇంజినీర్లు,ఆర్కిటెక్ట్ లు య‌జ‌మానుల స‌మ‌క్షంలో ఆన్ లైన్ లో సెల్ఫ్ స‌ర్టిఫికేష‌న్ ఇస్తే చాలని మున్సిపల్ మంత్రి తెలిపారు. భ‌వ‌న నిర్మాణ అనుమ‌తుల‌ను త్వ‌రిత‌గ‌తిన జారీ చేసేలా ప్ర‌భుత్వం కొత్త విధానం తీసుకొచ్చింది. APDPMS పోర్ట‌ల్ లో ఈ సెల్ఫ్ స‌ర్టిఫికేష‌న్ విధానం అందుబాటులోకి వ‌చ్చింది.

ఇది కూడా చదవండిఏపీ మహిళలకు సీఎం చంద్రబాబు నాయుడు మరో శుభవార్త! ఆది ఏంటో తెలుసా..!


అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి


మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు
:


తాడేపల్లిలో అరుదైన నాలుగు కాళ్ల జీవి కలకలం! భయంతో పరుగులు తీసిన స్థానికులు!


పసిపిల్లల దందా! 9 నెలల్లో 26 శిశువులను విక్రయించిన మహిళా ముఠా! తల్లి ఒడి నుంచి దూరం చేసి...!


టీడీపీ శ్రేణుల్లో ఉత్సాహం! రఘురామ కేసులో కీలక మలుపు! సీఐడీ మాజీ చీఫ్ పై సస్పెన్షన్ వేటు!


పోసాని కేసులో కొత్త మలుపు! అరెస్టు భయంతో హైకోర్టు మెట్లెక్కిన సజ్జల రామకృష్ణారెడ్డి, కుమారుడు!


శ్రీశైలం ఆలయంలో నకిలీ టికెట్ల గుట్టురట్టు! భక్తులకు మరో హెచ్చరిక!


ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ! ఉమెన్ ఎంపవ‌ర్‌మెంట్‌ బ్రాండ్ అంబాసిడర్‌గా ఆ హీరోయిన్..


రఘురామ టార్చర్ కేసులో షాకింగ్ ట్విస్ట్! కీలక ఆధారాలు వెలుగులోకి… డీఐజీకి నోటీసులు!


ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #andhrapravasi #constructions #permissions #todaynews #flashnews #latestnews